
పయనించే సూర్యుడు మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల మ్యూచువల్ బదిలీలకు సర్కారు ఒకే చెప్పింది, ఆరు వందల ఇరవై ఆరు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో నెం. 70 ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహా రెడ్డి, రాష్ట్రంలో ఉపాధ్యాయుల మ్యూచు వల్ ట్రాన్స్‌ఫర్స్‌కు సంబంధించిన దరఖాస్తుల లిస్ట్‌ను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపుతూ మార్గరద్శకాలు విడుదల చేశారు. బదిలీలపై ఇప్పటికే విద్యా శాఖకు ఆరు వందల ఇరవై ఆరు దరఖాస్తులు అందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,252 మంది ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ కానున్నారు.