
పయనించే సూర్యుడు జులై 12. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం వై.ఎస్సార్ నగర్ లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ విక్రమ్ సింగ్ లతో కలిసి శనివారం, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధి 8వ డివిజన్ వై.ఎస్సార్ నగర్ లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని 2 ఎకరాల స్థలంలో ఆర్కానట్ (వక్క) మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం క్రింద నాటిన మొక్కలకు రెగ్యులర్ గా వాటరింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నగరంలో రోడ్డు కిరువైపులా, డివైడర్ల వద్ద మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. రోడ్డు విస్తరణ పనులు చేసే సమయంలో చెట్లను తరలించే టెక్నాలజీ వినియోగించాలని అన్నారు. ప్రజలకు, వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు గతంలో నాటే వారని, నేడు ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా మోడల్ ప్లాంటేషన్ లో పంటనిచ్చే ఆర్కానట్ (వక్క) మొక్కలు నాటుతున్నామని అన్నారు. రోడ్డు మీడియన్ లలో వేసిన కోనోకార్పస్ మొక్కల వల్ల ఆరోగ్యానికి ఇబ్బందని వస్తున్న వార్తల దృష్ట్యా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పూర్తి స్థాయిలో తొలగించామని, వీటి స్థానంలో మహాగని, ఆర్కానట్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అటవీ, సంబంధిత శాఖల అధికారులు, లక్కీ కిడ్స్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

