
(సూర్యుడు అక్టోబర్ 3 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో హిందూ సాంస్కృతి భావితరాలకు అందిస్తాం ముఖ్య అతిథులుగా హాజరైన చాముండేశ్వరి గురు దత్త పీఠం కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గురుజి నూకల శ్రీనివాసరెడ్డి ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది హిందూ ధర్మాన్ని, సంస్కృ తిని, సంప్రదాయలను భావి తరాలకు అందించే విద్యుక్త ధర్మాన్ని రా ష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకుంటుందని ఆర్ఎస్ఎస్ జిల్లా శారీరక్ ప్రముఖ్ గొడుగు సోమేందర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్స వాల్లో భాగంగా శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో ప్రధాన విధులలో స్వయం సేవకులు పద సంచాలన్ నిర్వహించారు. అనంతరం దొమ్మాట గ్రామంలో ఆర్ఎస్ఎస్ 100 వసంతాల దసరా ఉత్స వంలో ముఖ్య అతిథులుగా చాముండేశ్వరి గురు దత్త పీఠం బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గురూజీ, నూకల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. దేశానికి పునర్వైభవం తేవడమే సంఘ్ లక్ష్య మన్నారు. జిల్లా శారీరక్ ప్రముఖ్ గొడుగు సోమేందర్ మాట్లాడుతూ. 1925లో నాగపూర్ లోని డాక్టర్, కేశవ్ బలిరాం హెడ్గే వారు విజయదశమి రోజున వందలాది మందితో స్థాపించిన ఆర్ఎస్ఎస్ నేడు కోట్ల మంది కార్యకర్తలతో పనిచేస్తుందన్నారు. దేశ పునర్నిర్మాణం, వ్యక్తి నిర్మాణం కొరకు ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రమేష్,తరుణ్, కనక రాములు, ప్రభు స్వామి,రజినీకాంత్, రంజిత్ స్వయం సేవకులు పాల్గొన్నారు.
