
పయనించే సూర్యుడు జూలై 22 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఆర్థిక అవసరాల నిమిత్తం జరిపే ఆర్థిక లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు తెలిపిన ఆత్మకూరు సిఐ గంగాధర్. తమ విలువైన ఆస్తుల కొనుగోలు అమ్మకాలలో ఇతర వ్యాపార లావాదేవీల సమయంలో నగదు బదలాయింపులో అతి జాగ్రత్తగా ఉండాలని ఆత్మకూరు సిఐ గంగాధర్ ప్రజలకు సూచనలు చేశారు. జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నేపథ్యంలో ప్రజలు ఆర్థిక లావాదేవీలపై అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త వహించాలని సూచించారు. బ్యాంకుల నుండి లేద ఇతర ప్రాంతాల నుండి నగదును తీసుకువెళ్లే సమయంలో చుట్టుపక్కల కొత్త వ్యక్తుల కదలికలను గమనిస్తూ జాగ్రత్త వహించాలని అలాగే మిమ్మల్ని వెంబడించే వ్యక్తులను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలని సూచించారు. పలు రద్దీ ప్రాంతాలలో మీ విలువైన నగదు లేదా వస్తువుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటేనే వాటిని జాగ్రత్త చేసుకోవచ్చని తెలిపారు.. ఇటువంటి సమయంలో మీ కదిలికలను గమనించే అనుమానస్పద వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.