
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
టి ఇ యల్ నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి.. పి ఆర్ జి ఐ కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు .త్వరలో జిల్లా డి పి ఆర్ ఓ లకు ఉత్తర్వులు ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని ఆర్ యన్ ఐ లేని పత్రిక లు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పి డి ఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్, పి ఆర్ జి ఐ న్యూ ఢిల్లీ అప్పీలు చేయగా ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి ఆర్ యన్ ఐ లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు ఆర్ యన్ ఐ లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీచేసింది దీని గమనించి రాష్ట్ర జిల్లా పౌరసంబంధాల అధికారులు పరిగణించాలని ఆర్ ఎన్ ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సదరు జిల్లా పౌరసంబంధాల అధికారులు సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేశారు.