
డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి.
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 21:-రిపోర్టర్ (కే.శివకృష్ణ) స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశానుసారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సంగుపాలెంలో ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయటం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈనెల 27న జరుగునున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మన కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మన అమూల్యమైన ఓటు ప్రాధాన్యత 1 ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదురు బాక్సులో 1 అంకెను వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించుకుందామని తెలియజేసినారు. బాబు విజన్, లోకేష్ దూకుడు, వర్మ ఆలోచన, మంచితనంతో పాటు రాజా అనుభవంతో మన బాపట్ల నియోజకవర్గ యువతకు గొప్ప మేలు జరుగుతుందని, యువతకు విద్య ఉద్యోగ,ఉపాధి అవకాశాల మెండుగా ఉంటాయని వీటితో పాటుగా ఇప్పటికీ రాజకీయాలలో యువతకు ప్రాధాన్యత కల్పించారని ఈ సందర్భంగా తెలియజేశారు. AI లో యువత రాణించాలని, AI ని ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరారు. కావున మన అమూల్యమైన ఓటు ప్రాధాన్యత 1 ని ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి ఇచ్చి తద్వారా అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కడియాల ప్రసాద్, వెంకటస్వామి, దాసయ్య, నరజాల శీను మరియు పట్టభద్రులు పాల్గొన్నారు.