



పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
ది. 27/3/25 అల్లూరిసీతారామరాజు జిల్లా ఎటపాక. నిన్న బుధవారం పాడేరులో జరిగిన ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఏ ఇ ఎఫ్) రాస్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనివాస్ పడాల్ పర్యవేక్షణలో, రాష్ట్ర ఆర్గనైజర్ సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఏ ఎస్ ఆర్ జిల్లా విస్తరణ సమావేశంలో ఏ ఎస్ ఆర్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు: గదబరి సోంబాబు (పాడేరు) వర్కింగ్ ప్రెసిడెంట్: గొల్లూరు జనార్దన్ రావ్ (పాడేరు డివిజన్)
ప్రధాన కార్యదర్శి: కంగాల శ్రీనివాస రావ్ (రంపచోడవరం డివిజన్) ఉపాధ్యక్షులు: కాక రాజు, సవలం శాంతి (చింతూరు డివిజన్) ఆర్గనైజర్ గా చిచ్చడి శేషారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు చింతూరు డివిజన్ నుండి జిల్లా కార్యదర్శులుగా తోడం కోటి, బాబు లక్ష్మీ, సహాయ కార్యదర్శులుగా సోంది ప్రసాద్, తోడం ముదరాజు, కంగాల కృష్ణవేణి, సహాయ కోశాధికారిగా మడకం లక్ష్మణ్ లను, అడ్వైజర్లుగా కణితి రామకృష్ణ, ముల్లి శేఖర్, సభ్యులుగా చావలం శివ కుమార్, తుష్టి వెంకటమ్మ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు కేంద్ర కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ నూతన ఏ ఎస్ ఆర్ జిల్లా కమిటీకి ఆదివాసి అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని స్పష్టం గా దిశా నిర్దేశం ఇస్తూ అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేశారు.