2.పని భారం తగ్గించాలి.
…..జి. వెంకట్రాంరెడ్డి, తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా.అధ్యక్షులు.
. పయనించే సూర్యుడు ( న్యూస్) జనవరి10( రిపోర్టర్ సి తిమ్మప్ప ) మక్తల్ .తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు శాసన సభ్యుల ఇళ్ళ ముందు నిరసన తెలిపి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఇంటి ముందు నిరసన తెలిపి ఎమ్మెల్యే ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రకాంత్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ గౌడ్ కు వినతి పత్రం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నెలకు 18000/- ఇచ్చేందుకు, స్థానిక శాసనసభ్యులైనా డాక్టర్ వాకిటి శ్రీహరి న్ను ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.ఆంజనేయులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సి ఆర్ గోవిందరాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, ఆర్ఎన్ రమేష్ సిఐటియు ఆత్మకూరు నాయకులు, గౌరమ్మ యూనియన్ జిల్లా కార్యదర్శి, మహేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తాలూకా లోని అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యశోద కర్ని పి హెచ్ సి అధ్యక్షులు, ఇందిరా అమ్మిన బేగం, శివమ్మ బాలమణి ఉట్కూర్ పీహెచ్ సి పద్మ, అంజమ్మ నర్వ శాంతమ్మ అంజమ్మ మాగనూరు అనురాధ, శాంతమ్మ అమరచింత సుజాత, లక్ష్మి, అనురాధ, వెంకటమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు