
ఫిక్స్డ్ వేతనం 18000/- చెల్లించాలి.
…సి ఆర్ గోవింద్ రాజ్ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్26//
//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
రాష్ట్ర ప్రభుత్వం ఆశాలోకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిన్న కమిషనరేట్ ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్లిన ఆశాలపట్ల నిర్బంధాన్ని ప్రయోగించడం కాకుండా అనేకమంది గాయాల పాలయ్యారు. ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మక్తల్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం దేశించి సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు కర్ని పి హెచ్ సి అధ్యక్షురాలు గోవిందమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశాలపట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వాళ్ల సమస్యల పరిష్కారం కొరకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఆశాలు కొత్తగా ఏమీ కోరడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆశాల సమస్యలకు ముందుకు రాకపోతే ఉద్యమం మరింత అద్భుతంగా మారే అవకాశం ఉందని అనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకురాలు యశోద, సుజాత, అమీనా బేగం, ఇందిరా, మాట్లాడుపోరాటాల్లో మేము భాగస్వామి అవుతామని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పరాదని వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. వెంకటమ్మ, అనురాధ, అనిత, లక్ష్మి, పార్వతమ్మ, రక్షిత బేగం, సంతోష,రేణుక,పద్మ,, సావిత్రమ్మ , బాలమ్మ, పద్మ, అనురాధ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.