
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి : జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు సులానగర్ పి హెచ్ సి ని సందర్శించడం జరిగినది ఆషాడే కార్యక్రమంలో పాల్గొని ఆశా వర్కర్లకు పలు సూచనలు చేశారు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ఆశలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగినది. టేకులపల్లి మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల డెంగ్యూ జ్వరాలు తగ్గించడం గురించి, మలేరియా నిర్మూలనకు తగు సూచనలు చేయడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో డాక్టర్ వెంకటేశ్వర్లు సి హెచ్ ఓ పార్వతి ఆరోగ్య విస్తరణాధికారి దేవా , లింగయ్య, పాయం శ్రీను ,పి హెచ్ న్ చంద్రకళ, విజయ, వెంకటేశ్వర్లు కౌసల్య మరియు ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది