
మార్చి 19న చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
పయనించే సూర్యుడు మార్చి 17 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ లో భాగమైన 18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని రాష్ట్ర బడ్జెట్లో ఆశ రంగానికి నిధులు పెంచాలని ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆషాలను ప్రమోషన్ కల్పించాలని డిసెంబర్ 10న శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆదివారం పండగలకు సెలవుల ఉత్తరువు జారీ చేయాలని ఏఎన్సీ , పీఎన్సీ తదితర టార్గెట్లు రద్దు చేయాలని ,50లక్షల ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు పారితోషికంలో సగం పెన్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ఆశాలకు పూనం క్లాత్ తో కూడిన యూనిఫామ్ ఇవ్వాలని 2021 జూలై నుండి ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ చెల్లించాలని 2022 ,23, 24 సంవత్సరాల లెఫ్ట్రసీ సర్వే పెండింగ్ అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశాలకు రెస్ట్ ఏర్పాటు చేయాలని ఆశాల పని భారం తగ్గించాలని పనులు చేయించకూడదని ఆశలకు డ్యూటీలు వేసే సందర్భంలో వెహికల్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ కి సమర్పించారు.అనంతరం సులానగర్ పీహెచ్సీ డాక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఆశా వర్కర్s యూనియన్ జిల్లా నాయకురాలు మండల కన్వీనర్ భూక్య మజహరి, హైమా వతి లుపాల్గొని మాట్లాడుతూ మార్చి 19 న కలెక్టరేట్ ధర్నా ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగతాయారు జి లక్ష్మీ సారమ్మ రమ సుజాత తదితరులు పాల్గొన్నారు
