
(సూర్యుడు సెప్టెంబర్ 1 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఆశ వర్కర్లను స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ గారు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ పరిధిలో ఉంచడం సరికాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సభను విజయవంతం చేయడం జరుగుతుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని సభను విజయవంతం చేస్తామని తెలిపారు. పనికి తగ్గిన వేతనం ఆశా వర్కర్లు పనిచేయడం లేదని పారితోషికాలు తగ్గించాలని వ్యతిరేకమైన నినాదాన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలి. పారితోషకాలు తగ్గించకూడదు గతంలో చెల్లించినట్లు మొత్తం డబ్బులు ప్రతి నెల చివరి నాటికి అకౌంట్లో వెయ్యాలి. కేంద్రం పెంచిన పారి తోసికాలు యధావిధిగా రాష్ట్రంలో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పిక్స్డ్ వేతనం రూపాయలు 18,000 రూపాయలుగా నిర్ణయించాలి. ఆరు నెలల పి.ఆర్.సి బకాయిలు లెప్రసీ టీబీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు వెంటనే ఇవ్వాలి. స్కూటం డబ్బులు వేయటం ఎల్ ఎస్ సి తదితర టార్గెట్స్ రద్దు చేయాలి. ఆదివారం పండగ సెలవు నిర్ణయించాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ప్రమోషన్స్ మట్టి ఖర్చులు తదితర హామీలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశయ వర్కర్ యూనియన్ డిమాండ్ చేయడం జరిగింది