Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆస్తికోసం తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు మోతె మండలం

ఆస్తికోసం తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు మోతె మండలం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 సూర్యాపేట జిల్లా ప్రతినిధి.

తండ్రిని హత్యచేసిన కేసులో కొడుకు అరెస్ట్..

భూమి వివాదం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకు.

మోతె పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు.నిందితున్ని అరెస్ట్ చేసిన మోతె పోలీసులు..
–సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ,తెలిపారు

జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహా నింధితుడు :నిమ్మరబోయిన గంగయ్య S/o వెంకన్న వ:35 సం. వృత్తి: వ్యవసాయం R/o నాగయ్య గూడెం,H/o విభళా పురం గ్రామం, మోతె మండలం.మృతుడు : నిమ్మరబోయిన వెంకన్న వ: 60 సం.స్వాదినం :రక్తం మరకలు కలిగిన గొడ్డలి,హెల్మెట్,నింధితుని దుస్తువులు స్వాదినం చేసుకోవడం జరిగినది.ఈనెల 2వ తేదిన మోతె మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న అనే 60 సంవత్సరాల వ్యక్తి విభుళాపురం గ్రామ శివారులో మామిళ్ళగూడెం వెళ్లే రోడ్డు మార్గంలో తీవ్రమైన గాయాలతో రక్తపు గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండగా సమాచారం పై మోతె పోలీసులు అక్కడికి చేరుకుని అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు.దీనిపై మృతుడు వెంకన్న కూతురు స్వరూప ఇచ్చిన ఫిర్యాదు పై మోతె పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారంపై ఉదయం 10 గంటల సమయంలో మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద హత్యకు పాల్పడిన నిందితుడు నిమ్మరబోయిన గంగయ్య ను మోతె ఎస్సై యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగినది.
నేరవిధానం:నాగయ్యగుడెం గ్రామ శివారులో మృతునికి ఉన్న 4.29 గుంటల భూమి సంబంధిత తగాదా విషయమై తండ్రి కుమారులకు మద్య గత కొద్ది నెలలుగా వివాదం జరుగుతున్నదని ఇదే విషయమై 5 నెలల క్రితం పెద్ద మనుష్యులు సమక్శ్యంలో తీర్మానం ప్రకారం గా మాఅమ్మా,నాన్న లకు 1 ఎకరం భూమి,కుమారులకు చెరొక 1 ½ ఎకరం భూమి మరియ మా కూతురుకు 29 గుంటల వ్యవసాయ భూమి వాటాలు వేసి ఒక అగ్రిమెంట్ కూడా వ్రాసినారు. ఇట్టి భూమి పట్టాలు చేయలేదు. తరువాత మృతుడు వెంకన్న తన వాటాకు వచ్చిన 1 ఎకరం భూమిని తనకు అప్పులు అయినాయి అమ్ముకున్నాడు.ఈ విషయాలై తండ్రిపై కోపంతో అతని పై పగ పెంచుకుని అతనిని ఎలాగైనా చంపాలని అందుకొరకు అడును చూస్తూ ఎప్పుడు ఒంటరిగా దొరికితే అప్పుడు అతనిని చంపాలని నిందితుడు బైక్ పైన ఎప్పుడు గొడ్డలి పెట్టుకొని తిరుగుచున్నాడు.తేదీ: 02.07.2025 మధ్యానం నింధితుడు బైక్ పైన మోతె కు వెళ్ళి తిరిగి మాఇంటికి వస్తు మోతె గ్రామశివారులో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని వస్తుండగా అదే సమయంలో మృతుడు సూర్యాపేట నుండి తన TVS మోటార్ సైకిల్ మీద No.TS 29-F-4747 గల దానిపై నాగయ్య గూడెం కు వెళ్ళుచుండడం గమనించి గుర్తుపట్టకుండా నింధితుడు హెల్మెట్ ధరించి మోపెడ్ విభాలాపురం గ్రామ శివారులో వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడిచేశాడు,నింధితుడు అక్కడి నుండి పారిపోవడం జరిగినది.ఇతనిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.ఈ సమావేశంలో డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి,మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, మోతె ఎస్సై యాదవెందర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.ఈ కేసులో బాగా పనిచేసిన మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ని,ఎస్సై యాదవేంధర్ రెడ్డి ని,మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని కేసు పర్యవేక్షణ చేసిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి నీ జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments