
పినపాక మండలం ఎల్చిరెడ్డి పల్లి ఎస్ టి కాలనీ పాఠశాల లో ఆయా దాదాగిరి.
పయనించే సూర్యుడు అక్టోబర్ 14
పినపాక ప్రతినిధి, పినపాక మండలం ఎల్చిరెడ్డి ఎస్ టీ కాలనీ లో ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు, ఈ పాఠశాల లో మధ్యాహ్న భోజన మెనూ పాటించటం లేదు అని గ్రామస్తులు మరియు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు, వారంలో మూడు రోజులు గుడ్లు పెట్టాల్సి ఉండగా ఈ విద్యా సంవత్సరం మొత్తం లో కనీసం ఐదు గుడ్లు కూడా పెట్టలేదు అంటే పర్యవేక్షణ లోపం ఎంత ఉందో తెలుస్తుంది ఇదే కాక ఏ కూర వండిన మొత్తం నీళ్ళు నీళ్ళు తో కూడిన చారు చేస్తుంది అని పప్పు కూడా ఉండకకుండా పచ్చిగా ఉంటుంది అని వాపోయారు, ప్రతీ శనివారం వెజిటేబుల్ బిర్యానీ పెట్టాల్సి ఉండగా పాఠశాల చరిత్ర లోనే ఒక్కసారి కూడా పెట్టలేదు అని , పాఠశాల కు ఉపాధ్యాయనిలు ఇద్దరు కొత్తగా ఉద్యోగం లో వచ్చిన వారు కావటం తో అలుసు చూసుకుని ప్రశ్నించిన గ్రామస్తులను, విద్యార్థులను ఇష్టం వచ్చిన రీతిలో తులనాడటం ఆమెకి అలవాటు అని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించకపోతే పాఠశాల కు తాళం వేసి బహిష్కరిస్తామని ఎం ఈ ఓ తక్షణం మధ్యాహ్న భోజన ఆయా ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.