
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఇంగ్లీష్ భాషను మెరుగు పరుచుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్ అన్నారు. శనివారం హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ లో ఆంగ్ల ఎక్స్ ప్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం సతీష్ మాట్లాడుతూ నిత్యం ఇంగ్లీష్ మాట్లాడితే భాష పై పట్టు వస్తుందన్నారు. ప్రిన్సిపాల్ అంజనీదేవి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ నైపుణ్యం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంగ్లీషుకు సంబంధించిన మెడల్స్, కవుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్స్ రఘువంశి, జితేంద్ర, ప్రైమరీ కోఆర్డినేటర్స్ కామేశ్వరి, నవ్య, డీన్ రఘుపతి, సి బ్యాచ్ ఇన్ చార్జి సోమయ్య, ప్రైమరీ ఇన్ చార్జి స్వరూప రాణి, ప్రీ ప్రైమరీ ఇన్ చార్జి మాధవి, ఏవో ప్రమోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.