
బస్సును ప్రారంభించిన ఎంఈఓ వెంకటేష్ నాయక్
పయనించే సూర్యుడు జూలై 31 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల కోసం ఆ కళాశాల చైర్మన్ భాస్కర్ సుండుపల్లె నుండి నూతనంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. మారుమూల సుండుపల్లి మండలం నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వలన ఇంజనీరింగ్ వైపు ఎక్కువమంది విద్యార్థిని విద్యార్థులు ముగ్గు చూపే అవకాశం ఉందన్నారు. చాలామంది సుదూర ప్రాంతాల్లో ప్రవేట్ హాస్టల్లో ఉంచి చదివించేందుకు ముగ్గు చూపకపోవడం వలన విద్యకు దూరమవుతున్నారని అన్నారు. తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిబ్బన్ కటింగ్ చేసి బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిట్స్ కళాశాల చైర్మన్ భాస్కర్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, వెంకటరమణ నాయక్, లిటిల్ స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు, బిసి నాయకులు మునిస్వామి, సీఆర్పీలు పాల్గొన్నారు.