
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్ట్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
రాందేవ్రావు ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి జాతీయ స్థాయి లో గుర్తింపు. మన రాందేవ్ రావ్ ఆసుపత్రి సిబ్బంది ఇండియన్ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి జాతీయ స్థాయి లో మొదటి ఐదుగురి లో ఒకరి గా నిలిచారు. హైదరాబాద్ మొత్తం లో పన్నెండు మంది ఉత్తిర్ణులు ఐతే అందులో మన ఆసుపత్రి వారు ముగ్గురు ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.పి శోభా రాణి.ఆశ జ్యోతి జి రాణి ఈ ఇండియన్ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్ ను మదర్ తెరస్సా మరియు ఫ్లోరెన్స్ నైటింగల్ ని ఆదర్శం గా తీసుకొని డాక్టర్ శ్రీనివాస్ సామవేదం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ క్రిటికల్ కేర్ మరియు డాక్టర్ స్మిత మరియు డాక్టర్ ధృతి వారి ఆధ్వర్యం లో అత్యున్నత ప్రమాణాలతో భోధించి భారత దేశం లో నే ఇండియన్ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్ చేసిన మొదటి పది మంది లో రెండు ర్యాంకులు మన రాందేవ్రావు ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది సాధించినందుకు ఆసుపత్రి యాజమాన్యం విక్రందేవ్ రావ్ మీరా రావ్, ప్రశాంత్ రెడ్డి అపర్ణ రావ్ అభినందించారు. సేవ రంగం లోనే కాకుండా వృత్తి విద్య సంబంధమైన కోర్సు లు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్థాపించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఈ ఇండియన్ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్ పాస్ ఐనందుకు వారికీ నెలకు 75000 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఇలా వారిని ప్రోత్సహించినందుకు ఆసుపత్రి యాజమాన్యానికి ఈ పాస్ ఐన నర్సింగ్ స్టాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. “మా సిబ్బంది సాధించిన ఈ విజయంతో ఆసుపత్రి ప్రతిష్ఠ మరింత పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిక్షణలు పొందేలా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాము,” అని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె కామలాకర్ సిఈఓ డాక్టర్ యన్ యోబు తెలిపారు.
