
పయనించే సూర్యుడు జులై 07(పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నందు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మిట్టపల్లి స్వరూప ముగ్గు పోయించుకొని ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ గిరీష హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొలతలు వేపించడం జరిగింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించిన నియమ నిబంధనలను లబ్ధిదారులకు వివరించారు. వార్డ్ ఇంచార్జ్ ఉలింగ సతీష్ మాట్లాడుతూ 16వ వార్డు నందు 15 ఇల్లు మంజూరు అవ్వగా ఇప్పటివరకు 7 ఇల్లులు నిర్మాణం పనులు ప్రారంభించారు అని తెలిపారు. మిగతా లబ్ధిదారులు కూడా త్వరత గతిన ఇంటి నిర్మాణం పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ గిరీష బంపర్ వార్డ్ ఇంచార్జ్ ఉలింగ సతీష్, కమిటీ మెంబర్స్ గుడివాడ వీరభద్రం, లింగంపల్లి శీను, మనోజ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు