
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం “కోయగూడెం” గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇందిరమ్మ ఇండ్ల పథకం”పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇండ్లకు నేడు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య భద్రాద్రి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పటేల్ , ITDA P. O గౌతమ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అతి త్వరలో మండల పరిధిలోని అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి ఇండ్లను మంజూరు చేయిస్తామని ఎలాంటి లోటుపాటులు లేకుండా నిజమైన పేదవాళ్ళని గుర్తించి పారదర్శకంగా ఎంపిక పక్రియ నిర్వహించి వారికీ ఈ పథకాన్ని అందజేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్- ఉమా, MRO నాగ భవాని ,DSP చంద్ర భాను ,ఎంపీడీఓ రవీందర్ ఎంపిఓ గణేష్ గాంధీ, C. I తాటిపాముల సురేష్ ,S. I లు పోగుల సురేష్, శ్రీకాంత్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవా నాయక్,నాయకులు ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, రెడ్యానాయక్, వీరభద్రం,బండ్ల రజినీ – శ్రీనివాస్, శశికల,సరిత, రజియా, శంకర్,ముచ్చా సుధాకర్ బానోత్ రవి,భద్రు, సర్దార్,లక్కినేని శ్యామ్,ధర్మయ్య, తులసి రాం, మంగీలాల్,హనుమంతు,బన్సీ, కోటి జింకల రాజు, రాందాస్ ఖానా, సుధాకర్, బానోత్ సురేందర్, సుభాష్ చంద్ర బోస్,సామినేని సాయి,శివాజీ, జాల గణేష్,వినయ్,ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.