
పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్
( పయనించే సూర్యుడు మే 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానూసారంగ కొండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మలకు అధికారులతో పాటు షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత లోటు లేకుండా చూడాలని ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే పనులను త్వరగా పూర్తి చేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి మరియు సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు తెలిపారు.
