
తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని కలత చెందిన బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు
బాధితులకు న్యాయం జరిగేంతవరకుఅండగా ఉంటామని బి.ఆర్ ఎస్ పార్టీ భరోసా
15 సంవత్సరాలుగా కోయగూడెం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై పలు ఆరోపణలు ???
జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు
పయనించేసూర్యుడు ఏప్రిల్ 17 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకుల పల్లి మండలం కోయ గూడెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎల్ఏ సొంత గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ కోయ గూడెం గ్రామసభ బహిరంగ సమావేశంలో నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని లబ్దిదారులు నుండి దరఖాస్తులను తీసుకోగా 390 దరఖాస్తు లు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ధరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. గ్రామం లో అందరూ నిజమైన లబ్ధిదారులు సంతోష పడినారు . కానీ భూమి పూజ శంకుస్థాపన రోజు 303 ఇళ్లు మంజూరయ్యాయి అని 3 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ లబ్దిదారులు అందరికీ వచ్చాయి అంటు నే పంచాయతీ సెక్రటరీ ఊకె వసంతరావు తన దగ్గర లిస్ట్ లేదు ,హౌసింగ్ ఏ ఇ దగ్గర ఉంది అని ప్రతిరోజు చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో హౌసింగ్ఏఇ ని సంప్రదిం చగ లిస్ట్ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉంది అని, ఒక లబ్దిదారులు ఎంపీడీవో ను సంప్రదించి అడగ గా గోపాలకృష్ణ సెక్రటరీ దగ్గర సంప్రదించి తీసుకోవాలని సూచించారు.”” కోయ గూడెం పంచాయతీ సెక్రటరీ ఎవరు “?
కోయగూడెం పంచాయతీ సెక్రటరీ గా 15 సంవత్సరా లు గా విధులు నిర్వహిస్తున్నారు ఊకే వసంతరావు బదిలీ గా తడికల పూడి పంచాయతీ కి వెళ్ళిన ఈ మద్య కోయ గూడెం పంచాయతీ లో దర్శనం ఇస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్థానిక ప్రజానీకం సెక్రటరీ గోపాలకృష్ణ లేదా ఊ కే వసంతరావు అనే డైలమా లో ఉన్నారు. అధికార, రాజకీయ అండ తో ఇక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ ఇక్కడే పదవి విరమణ చేసే వరకు విధులు నిర్వహిస్తాడా స్థానిక నాయకులు కు వత్తాసు పలుకుతూ ఉద్యోగి అనే విషయం మరచి ఏకపక్షంగా తానా అంటే తంధాన అంటాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల జాబితా పంచాయతీ ఆఫీసులో లిస్టు ప్రదర్శించక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందని నిజమైన లబ్దిదారులు పేర్లు రాక కొందరు నాయకులు,ఆర్థికంగా ఉన్నవారికి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎలక్షన్ లో సహకరించ లేదని వారికి ఇళ్లు రావని చెప్పడంతోవారు బాధతోవాపోతున్నారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. త్వరలో జిల్లా కలెక్టర్ నుసంప్రదించి నిజమైన లబ్ధిదారులకు వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించే విధంగా చర్యలు తీసుకుంటామని బి ఆర్ ఎస్ పార్టీ పోరాడుతాము అని హెచ్చరించడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు గతంలో వర్షాకాలంలో వానలుకి ఇల్లు కూలిపోయాయి. ఇదే పంచాయతీ సెక్రటరీ ఫోటోలు తీసి ఉన్నతాధికారులు పంపడం జరిగింది. కాని ఇప్పుడు ఇల్లు రాక వారి పిల్లలు వారి తల్లిదండ్రులు ను మనం నిజమైన లబ్ధిదారుల ము ఐనా మనకు ఎందుకు రావడం లేదని ఆవేదన తో అడుగుతున్నా ఏమీ చేయలేని “నిస్సహాయ స్థితిలో” ఉన్నారు .కావున నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ కోరుతూ పోరాటానికి సిద్ధం అని టేకులపల్లి లోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిజమైన లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలని లేని పక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా పోరాటాలు సిద్దం అని హెచ్చరించారు.