
ఏ అధికారైన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఒక కాల్ తో వారిపై ఫిర్యాదు చేయవచ్చు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13
శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : ఇందిరమ్మ ఇండ్ల పథకం నికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులో అనేక ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడుతుంటారు ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రత్యేక కాల్ సెంటర్ ను సెప్టెంబర్ 10 నాడు దీన్ని ప్రారంభించారు హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాల్ సెంటర్ ను ప్రారంభించారు దీనికి 18005995991 టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించారు ముందుగా ఈ కాల్ సెంటర్ 10 మంది సిబ్బంది తో పనిచేయనున్నారు వీరు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూస్తారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులు లబ్ధిదారులు వివిధ దశలలో పనులు పూర్తిచేసే టైం లో లబ్ధిదారులను ఇబ్బంది కి గురి చేస్తే లబ్ధిదారులు నేరుగా ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది