
(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలి స్తున్న అడిషనల్ అగర్వాల్. కస్తూర్బా బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కలిసి మాట్లాడడం జరిగింది నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ. లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా ఎంపీడీవో, పంచాయతీ, కార్యదర్శి చూడాలని ఆదేశించారు. అనంతరం దొమ్మాట జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేసి మరుగుదొడ్లను పరిశుభ్రం చేసే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి సూచించారు.అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన,అడిషనల్ కలెక్టర్ కరీమా అగ్రవాల్..దొమ్మట ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న అపరిశుభ్రమైన చెత్తాచెదారాన్ని చూసి అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ దొమ్మట గ్రామ పంచాయతీ కార్యదర్శి బిచ్చయ్య,ఇన్చార్జి ఎంపీడీవో గపూర్ పై మండిపడి తక్షణమే శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనాన్ని, కూరగాయలను, పప్పులను,చక్కెర తద నిత్యవసర, సరుకులను పరిశీలించారు. కస్తూర్బా పాఠశాలలో మెనూ ప్రకారం కూరగాయలు పెట్టడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. డాక్టర్ నాగరాజు తో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ. ఇంత మంచి ప్రభుత్వ దావఖానలో ప్రతినిత్యం ఓపీలను తక్కువ చెకప్ చేసి రికార్డులో ఎక్కువ చూపిస్తున్నారని, గ్రామాల్లో ప్రజలకు, ప్రభుత్వ దాకా నాపై,వైద్య సేవలపై అవగాహన కల్పించాలని మండిపడ్డారు. ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా తక్షణమే వైద్య సేవలపై దృష్టి పెట్టాలని వైద్యాధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి లింగస్వామి,తాసిల్దార్ చంద్రశేఖర్ రావు, ఇన్చార్జి ఎంపీడీవో సయ్యద్ గఫూర్, ఎంఈఓ గజ్జల కనకరాజు, ఇన్చార్జి ఎంపీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
