ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ఆటో డ్రైవర్ల సమస్య తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణం
ఆటోలో ప్రయాణం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,
( పయనించే సూర్యుడు అక్టోబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని ఉద్దేశంతో జూబ్లీహిల్స్ లోని సోమాజిగూడ డివిజన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆటోలో ప్రయాణం చేసి ఆటో డ్రైవర్లను వారి యొక్క సమస్యలను మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైందని కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ ఉన్నారని,ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య చేసుకున్నారని దీని కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని చనిపోయిన కుటుంబాలకు ఇకనైనా సాయం చేయాలని ప్రతి ఆటో డ్రైవర్ కి ఏడాదికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరిచారని ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలను అమలు చేసితీరాలని లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తామని తెలియజేశారు.


