
ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే16
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియమక చట్టం చేసి మెగా డిఎస్సి 2025లో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ లో మినహాయించి షెడ్యూల్ ఏరియా కు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని,ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయటం జరుగుతుంది. చింతూరులో జరుగుతున్న ఈ దీక్షలలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్,డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ లు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదివాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా,? లేక మాట తప్పని ముఖ్యమంత్రి మిగిలిపోతారా అని ప్రశ్నించారు.అలాగే టిఏసి వెంటనే ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు,రెండవ రోజు దీక్ష శిబిరాన్ని ఆదివాసీ ఉద్యోగ సంఘ నాయకులు తిమ్మ.సాయి, ముచ్చిక సింగయ్య లు ప్రారంబించి మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చేవరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఏ సమస్యకు పరిష్కారమైన ఉద్యమాలతోనే దొరుకుతుందని దిక్షకు తమ పూర్తి మద్దత్తు ఉంటుందని అన్నారు. ఆదివాసి సీనియర్ నాయకులు అడ్వకేట్ ఆత్రం.నవీన్ పాల్గొని మన ఆదివాసి చట్టాలు జీవోలు ఆదివాసుల ఐక్య కార్యచరణ ఐక్య ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని 2000 సంవత్సరంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం జీవో నెంబర్ 03 ద్వారా ఐదవ షెడ్యూల్ భూ భాగంలో 100కు 100% స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేశారని, 2020 తర్వాత కొంతమంది స్వార్థపరుల వల్ల ఆ జీవో కొట్టివేయడంతో దిక్కు తోచని స్థితిలో ఆదివాసి సమాజం మిగిలిపోయిందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో కాని అరకు సాక్షిగా సభలో మాట్లాడుతూ జీవోని పునరుద్ధరిస్తానని, అలాగే ఈనెల 13వ తేదీన కొన్ని పత్రికల ద్వారా పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగులను వారితోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచురితమయ్యాయని ఆ హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అనంతరం జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఐటిడిఏ ఏపిఓ కి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జేఏసీ డివిజన్ సలహాదారులు ఎఫ్ ఎస్ ఓ తొడం.దేశయ్య,జేఏసీ నాయకులు బొడ్డు.బలరామ్, కాకా సీతారామయ్య, సోడే.అర్జున్, బీరబోయిన.అప్పారావు,శేఖర్, రమేష్,చందు,చక్రి,గంగరాజు, మడివి.శివ కుమార్,అఖిల్, సోయం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

