షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జనవరి 13 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో విలేకర్ల సమావేశం ఏర్పటు చేశారు. నాలుగు పథకాలను ఈ సంక్రాతికి ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కి, కేబినెట్ కు ధన్యవాదములు తెలిపారు. గత ప్రభుత్వం రైతు బందు పేరిట పెద్దలకు, గుట్టలకు, రోడ్లకు కూడా కట్టబెట్టి ప్తజాదనాన్ని 21000 కోట్లు వృధా చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కమిటీ లు వేసి రైతు భరోసా కు అర్హులైన రైతులను గుర్తించి బహిర్గతంగా గ్రామ సచివాలయం లో వెళ్లడిస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఇల్లు లేని పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే ద్యేయమన్నారు. భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకాన్ని పాటిష్టంగా అమలు చేస్తామన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లు అసంపూర్తిగా, నాణ్యత లేకుండా నిర్మించి నివాసలకు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. రాష్టం లో గత పది సంవత్సరాలనుండి ఒక్క రేషన్ కార్డు కూడా వ్వలేదని, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తూ, పేదలకు సోనా మాసూరి బియ్యం పంపిణి చేస్తామన్నారు.