 
పయనించే సూర్యుడు అక్టోబర్25 అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి
మండలం మరియు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజంపేట రోడ్డుపై ఉన్న అఖంపల్లెలో జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్ స్థానికులు మరియు మిత్రబృందంతో కలిసి పర్యటించారు. ఆ కాలనిలో సుమారు 30 కుటుంబాలు నివాసిస్తుంటారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భాదితులకు సత్వరమే అన్నిరకాలుగా ఆదుకోవాలని సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులకు తెలిపారు.అక్కడ బాధితుల వివరాల్లోకి వెళ్తే సప్పిడి వాసు, నాగరాణి దంపతులు మరియు వారి పిల్లలు నిద్రస్తున్న సమయంలో వేకువజామున ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి కూలిపోయింది ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉండే ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఇళ్ళు దాదాపుగా 95 శాతం దెబ్బతింది ఆ ఇంటితో పాటుగా కత్తి సుధాకర్, ముద్దిన భీమా ఇళ్ళు చాలా వరకు దెబ్బతిన్నాయి మిగితా కత్తి లలితా ముద్దిన సుజాత కత్తి సిద్దయ్య ముద్దిన లక్ష్మీదేవి సప్పిడి వెంకటేష్ సప్పిడి వెంకటరమణ ముద్దిన మల్లికార్జున ముద్దిన కొండయ్య కత్తి శివ తదితర నివాసం ఉంటున్న వారి ఇళ్ళు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయన్నారు. ఈ విశాయనికై ఎన్డీయే కూటమి ప్రభుత్వం తరపున భాదితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


