
(సూర్యుడు ఆగస్టు 30 రాజేష్ ) దౌల్తాబాద్ మండల
కేంద్రంలో ముబారస్పూర్ రైతు వేదిక వద్ద దొమ్మాట పైటిలైజర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఒక్క బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు మానే క్యూ లైన్ లో గంటలకు నిలబడి ఉన్న ఒక్కరికి ఒకే బస్తా ఇవ్వడం సరిపోవటం లేనందున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటలకు లైన్లో నిలబడ్డ చివరకు ఒక్క యూరియా బస్తా దొరకకపోవడం చివరికి నిరాశతో వెనిదిరిగి పోతున్నారు. రైతులు గత రోజులుగా నిద్రాహారాలు తెల్లవారు జాము నుండి పడి గాపులు కాస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. యూరియా మీద కష్టమైన హామీ చివరకు కదిలేది లేదంటూ నినాదాలు చేశారు. సకాలంలో యూరియా రైతులకు అందేటట్లు చూడాలని రైతులు కోరుకుంటున్నారు.
