
పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఇది కాలం తెచ్చిన కరువు కాదుకాంగ్రెస్ తెచ్చిన కరువే: కవిత నీటి నిర్వహణపై అవగాహన లేక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో ఎండిపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. ‘రైతులను అరిగోస పెడుతోన్న అసమర్థ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువే. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు బి ఆర్ ఎస్ పోరాడుతూనే ఉంటుంది’ అని చెప్పారు.