
పయనించే సూర్యుడు జూలై 12 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట మీదుగా తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు తమిళనాడు స్మగ్లర్లను సూళ్లూరుపేట పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 14 లక్షల రూపాయలు విలువచేసే 70 కిలోల గంజాయి తో పాటు వోక్స్వాగెన్ పోలో కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బిబిన్ నాథ్, రోహన్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ చెన్నై సిటీ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళి కృష్ణ, సూళ్లూరుపేట ఎస్సై వి. బ్రహ్మనాయుడు, తడ ఎస్సై కే కొండప్ప నాయుడు, ఏఎస్ఐ శ్రీ కుమార్ రెడ్డి కానిస్టేబుల్ రాఘవరాజు, సురేష్ లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిఎస్పి చెంచుబాబు అభినందించారు.

