
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //19 //హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్. ఇళ్ళందకుంట మండల కేంద్రంలో చత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకను మండల అధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు హాజరయ్యారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద చత్రపతి చిత్రపటానికి పాలాభిషేకం చేశి,పూలమాల వేసి,కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడని , భారతదేశంలో మరాఠా సామ్రాజ్య స్థాపనకు ఛత్రపతి శివాజీ తన పాలన అంతటా, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేశాడు, వాటిలో సింహగడ్ యుద్ధం మరియు అతని రాజ్య రక్షణ ఉన్నాయి. శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న అనారోగ్యం కారణంగా మరణించాడు, కానీ అతని వారసత్వం అతని వారసుల ద్వారా కొనసాగింది, అని మరియు విదేశీ శక్తులకు వ్యతిరేకంగా మరాఠాల ప్రతిఘటనను ప్రేరేపించి. అతను ఒక దార్శనిక నాయకుడిగా, న్యాయమైన పాలకుడిగా మరియు ధైర్యం మరియు స్వాతంత్ర్యానికి చిహ్నంగా గుర్తుంచుకుంటామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చత్రపతి శివాజీ జయంతి వర్ధంతి వేడుకలను ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంగిలే ప్రభాకర్, గైకోటి రాజు, తిప్పారపు వీరన్న, కరటపల్లి రాజు, ఎర్రబాటి రమేష్, మాజీ ఉపసర్పంచ్ రవికుమార్, శ్రీనివాస్, బాబురావు, రమేష్ తో పాటు ఆరెకుల బాంధవులు పాల్గొన్నారు.