
పయనించే సూర్యుడు మే 23 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందుహనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది . హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ శోభాయాత్రలో హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ శోభాయాత్రను ఆహ్లాదకరంగా మార్చేందుకు భక్తులు పూల వర్షం కురిపించారు. పూలతో శోభాయాత్రకు స్వాగతం పలికే కార్యక్రమం అద్భుతంగా ఆకట్టుకుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధను చాటుకున్నారు. పట్టణ పురవీధులన్నీ జై హనుమాన్ నినాదాలతో మార్మోగి పోగా, హనుమాన్ జయంతి వేడుకలు ఇల్లందులో మరుపురాని సంఘటనగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో పూలు మరియు మజ్జిగ ప్యాకెట్ల దాతలుగా అర్వపల్లి రాధాకృష్ణ, దివ్వెల రమేష్, చందా చక్రధర్, పల్లెర్ల చంద్రశేఖర్, యెలుగూరి మధుబాబు, యెలుగూరి నాగేష్ కుమార్, వ్యామసాని జనార్దన్ రావు, యెలుగూరి మల్లికార్జున్, సైఫా రాజశేఖర్, పుల్లూరు సతీష్ కుమార్, కుమ్మరి కుంట్ల నారాయణ, గందె సురేష్, రామిడి శంకర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు నరేంద్రులు అను, వాసవి క్లబ్ అధ్యక్షుడు భోనగిరి రవికిరణ్, కటకం సత్యందర్, నాగరాజు, తాటిపల్లి సుబ్బారావు, దివ్వెల నాగేశ్వరరావు, గౌరిశెట్టి నగేష్, నరేందర్ తదితరులు విశేష సహకారం అందించారు.