
మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
గంట్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆవ జగన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
పయనించే సూర్యుడు మార్చ్29 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ : ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన మాసంగా, పర్వదినంగా ముస్లింలు రంజాన్ ను జరుపుకుంటారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ఆవ జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లింల భక్తిశ్రద్ధలకు నిదర్శనమని, దయ, సహనం పొందుతాయని అన్నారు. రంజాన్ మాసంలో ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వారిలో ఆధ్యాత్మిక శుద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో మతాలకు అతీతంగా పర్వదినాలను జరుపుకోవడం ఆనవాయితీ అని, అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాలకు సంబంధించిన పర్వదినాలలో, వేడుకల్లో పాల్గొని తమ మానవత్వ భావాన్ని చాటుతారని తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో జగన్ ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి, మన్నె కవిత నారాయణ, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, నటరాజ్, వీరేశం గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచులు రంగయ్య గౌడ్, పల్లె శ్రీనివాస్ రెడ్డి, నరసింహా నాయకులు ఫారూఖ్, అంజయ్య, కిరణ్ గౌడ్, ఆనంద్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.