పయనించే సూర్యుడు అక్టోబర్ 24, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
ఈనెల 28వ తేది ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.పి నాగిరెడ్డి,రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.పి నాగిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు నేడు స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నేడు ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.పి నాగిరెడ్డి మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ, ప్రధానంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచారని , మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్ర బాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం కేవలం దాచుకో.. దోచుకో అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం కొంతైనా లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను పేద, మద్య తరగతి విద్యార్థులకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తే,వాటిని అమలు కాకుండా అడ్డుకుంటూ పిపిపి విధానానికి తెరలేపడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేసేందుకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. కోటి సంతకాల సేకరణ లేఖలను,రాష్ట్ర గవర్నర్ కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అందజేసి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ శశికళ రెడ్డి, అంటే మేధావులు సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, అధికార ప్రతినిధిఅనిల్ అమృత రాజ్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కారు రవి కుమార్, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రెటరీ దేవనగర్ భాష, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ నంద్యాల జిల్లా లీగల్ సెల్లుఅధ్యక్షుడు రామసుబ్బయ్య , జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ సెక్రెటరీ హరి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేస చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి కలాం భాష, చింపింగ్ బషీద్ కో ఆప్షన్ సభ్యులు సలముల్లా, వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, మునయ్య, సాయిరాం రెడ్డి జాకీర్ హుస్సేన్,తదితరులు రహమతుల్లా, ఎద్దు రవి, జిల్లా సెక్రెటరీ అశోక్ రెడ్డి,పార్ధుడు, పైలట్, కుమ్మరి రాముడు, శంకర్ నాయక్,సితార శ్రీను తదితరులు పాల్గొన్నారు


