
ఇంకెంతకాలం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడి
ప్రభుత్వాలు మారిన కార్మికుల జీతాలు పెరగడం లేదు
మేడే లోపు జీతాలు పెంచాలని సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
జేఏసీ నాయకులు షేక్ యాకుబ్ షావలి కుడుదుల వీరన్న భానోత్ రామ్ సింగ్ జరుపుల సుందర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి హైటెక్ కాలనీలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మస్టర్ అడ్డా వద్ద ఈరోజు జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు షేక్ యాకుబ్ షావలి, కుడుదుల వీరన్న భానోత్ రాంసింగ్, జరుపుల సుందర్, పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి లాభాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటున్నాయన్నారు. రెండుసార్లు పర్మినెంట్ కార్మికుల జీతాలు పెంచుకున్నారని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తుండడం వల్లనే, లాభాలు వస్తున్నాయని అన్నారు. ఈలాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు కనీస వేతనాలు ఇవ్వకుండా.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో నయా పైస జీతం పెంచలేదన్నారు. ఎన్నో హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొచ్చి 17 నెలలు దాటిన కార్మికుల వేతనాలు పెంచకపోవడం గర్హనీయమన్నారు. ఈ కార్మికుల జీతాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి గారి నోటి మాటే సింగరేణి జీతాలు చెల్లిస్తుందన్నారు. ఇప్పటికైనా మేడే కానుకగానైనా కార్మికుల జీతాలు పెంచాలన్నారు లేని ఎడల సింగరేణిలో మరొక్కసారి కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. ఈనెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఉదయం నిరసన దీక్ష, తోపాటు సాయంత్రం నాలుగు గంటలకు మహా ధర్నా ఉంటుందన్నారు ఈ ధర్నాలో ప్రతి కాంట్రాక్టు కార్మికులు పాల్గొని తమ వేతనాలు పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో, జేఏసీ నాయకులు నరసింహారావు మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న, ఏనుటి నాగయ్య బ్రాంచి కార్యదర్శి గుగులోత్ మధార్,శివయ్య,ప్రసాద్ ఎర్రమ్మ షేక్,బాబు,సోమయ్య, షఫీ,మౌనిక, కౌసల్య సూర్య,రవి,బాలు, పాల్గొన్నారు