ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్…
( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ)షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం, స్థానిక సిఐటియు ఆఫీస్ లో జరిగింది.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ఈ నెల 30వ తేదీన బీటెక్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటిఐ, పారామెడికల్, కళాశాలలు బంద్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే ప్రభుత్వం పలు మార్లు మాట ఇచ్చి మాట తపింది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదు అని ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి విద్యార్థులకు పెడింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ కార్యదర్శి శివ శంకర్ టౌన్ కమిటీ సభ్యులు చరణ్,బబ్లు, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

