
( పయనించే సూర్యుడు మార్చి 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ గ్రేడ్ 1 గ్రంధాలయం -చైర్మన్ కొప్పుల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో.. విశ్వ వాసు నామ ఉగాది పండుగ పురస్కరించుకొని షాద్ నగర్ గ్రేడ్ 1 గ్రంధాలయ కమిటీ ఆధ్వర్యంలో 29- మార్చి -2025 రోజు ఉదయం11 గంటల నుండి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని సోమవారం గ్రంధాలయ భవన కార్యాలయంలో గ్రంధాలయ శాఖ కమిటీ సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మరియు గ్రంథాలయ జిల్లా చైర్మన్ తదితర ముఖ్య నాయకులు కవి సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 తేదీ రోజు కవి సమ్మేళనం మరియు ఉగాది పచ్చడి, కార్యక్రమం మరియు ముఖ్య అతిథులకు సత్కారాలు, మరియు కవి సమ్మేళనంలో నగదు బహుమతులు, ప్రశంస పత్రాలు, అందజేస్తామని చైర్మన్ కొప్పుల మధుసూదన్ రెడ్డి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నక్క బాలరాజు యాదవ్, సి విరేష్ కుమార్, జనరల్ సెక్రెటరీ క్యూసెట్టి శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ జూపల్లి చంద్రశేఖర్ సింగపాకా అనిల్ కుమార్, ఆర్గనైజర్ మరియు మీడియా సెక్రెటరీ అల్వాల దర్శన్ గౌడ్, ట్రెజరర్ నీళ్ల రవీందర్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర అప్ప , డైరెక్టర్లు రేఖల శ్రీకాంత్, అక్రమ్, ఫయాజ్, కాట్న రాజేష్ ,తూం కృష్ణారెడ్డి, చీపిరి శివరాంలు యాదవ్, ఆలోన్ పల్లి రాజు గౌడ్ ,కే రవి నాయక్, జుట్టు అనిల్ కుమార్, ఏ. అనిల్ కుమార్ యాదవ్, సమావేశంలో పాల్గొని ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు.