
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లినరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్15 చింతూరు
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారికి కూనవరం మండలం టేకుల బోరు ఉదయభాస్కర్ కాలనీ గ్రామస్తులకు నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ఫ్యామిలీ ప్యాకేజీ స్ట్రక్చర్ వెలివేషన్ తో కూడిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని చింతూరు ఐటీడీఏ గారికి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు అచ్యుతాపురం ఎటపాక మండలం భూమి సమస్య చింతలపాడు పూసుగూడెం ఎటపాక మండలం గ్రామాలకు మంచినీళ్లు కరెంటు రేషన్ కార్డులు స్థానిక సమస్యల మీద ధర్నా చేయడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద సంయుక్త జిల్లా నాయకురాలు కల్పనా మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు కూనవరం మండలం ఉదయ భాస్కర్ కాలనీ తో పాటు మిగతా గ్రామాలకు కూడా మూడుసార్లు గోదావరి ముప్పు వచ్చి పోయినప్పటికీ ఎటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సంయుక్త డివిజన్ నాయకులు దాసరి సాయిబాబు నాగేశ్వరావు అర్జున్ ఏసుబాబు చిట్టెమ్మ లక్ష్మి హరిబాబు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు