పయనించే సూర్యుడు జనవరి 11
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన 22 ఏళ్ల యువకుడికి పరామర్శించి ఈవా ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం అందించిన బీ ఆర్ ఎస్ నాయకులు న్యాయవాది కొమ్ము విజయ్ మూడేళ్ల వయసులో నాన్నను కోల్పోయి,అమ్మ చేతి కష్టం తో పెరిగి పెద్ద వాడై, అమ్మకి చేదోడు వాదోడుగా నిలవాల్సిన సమయంలో సికెల్ సెల్ అనీమియా అనే రక్త సంబంధిత వ్యాధి మరియు తుంటి ఎముకల సంబంధిత సమస్యలతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న 22 ఏళ్ల యువకుడు బి. సాయి ప్రసాద్ ని పరామర్శించి ఈవా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించి రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా సరిపడా ఔషధాలు కూడా అందించదానికి కృషి చేస్తానని భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు న్యాయవాదికొమ్ము విజయ్ ఈ సందర్భంగా దాతలు స్పందించి సహాయం అందించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.