
పయనించే సూర్యుడు న్యూస్:రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లిడించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్లగొండతో పాటు పలు జిల్లాల్లో భారీ వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం భారీ వర్షం పడింది. సుమారు అరగంటపాటు ఈదురు గాలులతో కూడిన వాన కుండపోతగా కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.