
పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై అధికార యం త్రాంగం దృష్టిసారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తా మని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతీ గ్రామంలో లబ్ధి దారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమ య్యారు.
లబ్ధిదారుల జాబితా ఎంపి కలో ఎమ్మెల్యేల సూచనల ను అధికారులు పరిగణ లోకి తీసుకుంటున్నారు. రెండు విడుతల్లో కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది లబ్ధిదా రులతో జాబితా రూపొం దించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించ టానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తరువాత నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోగా కనీసం పునాది, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇదిలాఉంటే.. మొదటి విడతలో ఎంపిక చేసిన 72వేల మంది లబ్ధిదారు లకు గాను నలబై రెండు వేల మందికే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదా రుల మంజూరు పత్రాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిసింది. మిగతా ముప్పై వేల మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు సమాచారం