Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఈ నెల 18 న అమ్మణ్ణికి శాకాంబరి అలంకారం

ఈ నెల 18 న అమ్మణ్ణికి శాకాంబరి అలంకారం

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 14 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :

సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భముగా ఈ నెల 18 వ తేదీన శాకాంబరి అలంకారం చేస్తున్నట్లు ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్నలక్ష్మి తెలియజేసారు, ఈ రోజు ఆలయం లో జరిగిన మీడియా సమావేశం లో ప్రస్సన్న లక్ష్మి మాట్లాడుతూ 18 వ తేదీ భక్తుల భాగస్వామ్యం తో అమ్మణ్ణికి శాకాంబరీ అలంకారం చేయనున్నట్లు భక్తులు స్వచ్చందంగా మూడురకాల కూరగాయలు ,రెండు రకాల పండ్లను ఇవ్వవచ్చునని తెలిపారు, భక్తులు ఇచ్చే పండ్లు ,కూరగాయలు 16 వ తేదీన ఆలయం లోని ఆస్థాన మండపం లో సిబ్బంది వద్దకు భక్తులు చేర్పించాలని ఆమె తెలియజేసారు,ఆగస్టు 1 వతేది శ్రావణ మాసం సందర్భముగా అమ్మణ్ణికి పుష్పయాగం జరిపిస్తున్నట్లు ,అలాగే 22 వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు కూడా జరిపించడం జరుగుతుందని ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మణ్ణి కృపకు పాత్రులు కావాలని సహక కమీషనర్ ప్రసన్న లక్ష్మి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments