
కరపత్రల విడుదల
ఈనెల 25న చేయూత పెన్షన్ దారుల మక్తల్ నియోజకవర్గ సన్నాహక మహాసభ.
- నారాయణపేట జిల్లా ఇంచార్జి మంద నరసింహ మాదిగ //పయనించే సూర్యుడు// సెప్టెంబర్23// మక్తల్
వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయకపోతే వికలాంగుల ఆత్మబంధువు మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో వికలాంగులతో పాటు చేయూత పింఛన్దారులందరూ ఏకమౌతారని అంబేద్కర్ చౌరస్తాలో సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమవేశనికి జిల్లా ఇన్చార్జి ముఖ్యఅతిథిలుగా మంద నరసింహ మాదిగ పాల్గొని మాట్లాడుతూ… వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల విషయంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, మాటల్లో ఒకటి, చేతల్లో మరొకటి చెబుతూ పెన్షన్ పెంచకుండా ద్రోహం చేస్తున్నది మండిపడ్డారు. అన్ని అర్హతలు నుండి పెన్షన్లు రాక వికలాంగులు, చేయూత పెన్షన్ దారులు అనేక అవస్థలు పడుతున్నారని, ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని, అర్హత కలిగిన వారికి వాహనాలు ఇతర పరికరాలు అందజేయాలని డిమాండ్ చేశారు.దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధమయ్యామని, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఫెన్షన్ దారులను చైతన్యం చేస్తూ పోరాటానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ వికలాంగులకు 6వేలు, వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4వేలకు పెంచుతామని గద్దెనెక్కి, 22 నెలలు గడుస్తున్నా ఆ హామీలు నెరవేర్చకుండా కాళ్లులేనొల్ల, చేతులు లేనోళ్ల, కండ్లు లేనోళ్ల పెన్షన్ ఎగగొట్టడం రేవంత్ సర్కార్ కు తగదని మండిపడ్డారు, వారికి రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా వేలకోట్ల రూపాయల బడ్జెట్ పక్కదారి పట్టించి ద్రోహం చేస్తున్నారని అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వర్గాలకు, పేదలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ పేదల్లో మెజార్టీగా ఉన్న, కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవిస్తున్న వికలాంగుల, ఆసరా పెన్షన్ దార్ల పొట్ట కొట్టడం ప్రభుత్వానికి తగదని విమర్శించారు. 22 నెలలుగా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, పెంచుతామన్న హామీ నెరవేర్చకుండా దగా చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు మౌనం వహించడం దారుణమని అన్నారు. పెన్షన్ దారుల బాధలు, ప్రభుత్వానికి ఎట్లాగూ కనబడడం లేదు.., కనీసం ప్రతిపక్షాలు, పార్టీలకు కూడా కనబడవా..? అని ప్రశ్నించారు.వికలాంగులు, ఆసరా పెన్షన్ దారులను ఏకం చేసి లక్షలాదిమందిని కదిలించి హైదరాబాద్లో లక్షలాదిమందితో వికలాంగుల, చేయూత పెన్షన్ దార్ల గర్జన నిర్వహిస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 25న మక్తల్ లో వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో సన్నాహక మహాసభ నిర్వహిస్తున్నామని, దీనికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ. హాజరై ప్రసంగిస్తారని, అందుకు మక్తల్ నియోజకవర్గంలో ఉన్న పెన్షన్ దారులు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకులు గుడిసె వెంకటయ్య మాదిగ జీర్గల్ నగేష్ మాదిగ జగ్గలి అంజప్ప మాదిగ వెంకటేష్ మాదిగ తేజ మాదిగ మనిగిరి కృష్ణ మాదిగ బొంబాయి రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు
