
పయనించే సూర్యుడు మార్చి 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విశ్వావసు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం అని అన్నారు. చిరు వేపపూత, మామడి కాత, పులుపులో పులకింతతో పాటు ఆరు రుచలతో ఆనందంగా ఆరంభించే ఈ తెలుగు నూతన సంవత్సరాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలనిఆకాంక్షించారు.ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో ఉత్సాహానికి,వేపపూతలోని చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి చింతలోని పులుపుమనంనేర్పుగావ్యవహరించాల్సిన పరిస్థితులను, మామిడి ముక్కలలోని వగరు వంటి రుచులు కొత్త సవాళ్ల గురించి క చివరగా కారం మనల్ని సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందాల ఈ తెలుగు నూతన సంవత్సరాదిని ఆనందంగాజరుపుకోవాలని ఆయన అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు.