
ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను..ఘన నివాళి అర్పించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు.
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 21 :-రిపోర్టర్( కే శివకృష్ణ )… చిత్తూరు జిల్లా, బంగారు పాళెం మండలం, రాగిమాని పెంట గ్రామానికి చెందిన వరదరాజు లు, సెల్వి దంపతుల పెద్ద కుమారుడు పంగల రాజేష్.., సోమవారం కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందారు. వీర జవాన్ కు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేష్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పంగల రాజేష్ త్యాగం మరువలేదని, తెలుగు జాతి తరపున వీర జవానుకు జోహార్లు అర్పిస్తున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు తెలిపారు.
నిన్న నార్త్ జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ మరణం
కార్తీక్ స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం.. బంగారు పాల్యం మండలం రాగిమానుపెంట గ్రామం
వరదరాజులు యాదవ్, సెల్వి దంపతుల రెండో కుమారుడు కార్తీక్
2017లో ఆర్మీలో చేరిన కార్తీక్, ఈ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని వేడుకుంటున్నా ను rip కార్తీక్.