
పయనించే సూర్యుడు
సుండుపల్లి జెడ్పి హైస్కూల్ నందు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు . అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా మహిళలు స్వయం శక్తితో ఎదుగుతూ, వాళ్లు ఎవరిపైన ఆధారపడకుండా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని, అందుకే కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి 90 రోజులు శిక్షణ అందించి పూర్తి అవగానే సర్టిఫికెట్ అందజేస్తామనీ, తర్వాత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల కోసం ప్రభుత్వమే కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తుందని, ప్రతి మహిళ గౌరవప్రదంగా ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా డ్వాక్రా సంఘాలకు బీసీ, ఎస్సీ, ఎస్టి, నిరుపేదలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా టిడిపి మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇన్చార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టిడిపి ముఖ్య నాయకులు, బిజెపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.