Tuesday, October 21, 2025
Homeతెలంగాణఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు..

ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు..

Listen to this article

రుద్రూర్, అక్టోబర్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో మంగళవారం ఆవులు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో 94 పాడి పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments