జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కన్నూరుపాలెం పశు వైద్యాధికారి డాక్టర్ డయాన అన్నారు. మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో ఉదయం పశు ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ గల్లా రాజు, కర్రి సత్యనారాయణ, కాయల మురళీధర్, ఉల్లింగల రమేష్, కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పశు ఆరోగ్య శిబిరంలో 12 పశువులకు గర్భకోస చికిత్స, 15 పెద్ద పశువులకు 30 లేగదూడలు , 300 గొర్రెలు మేకలకు కు నట్టల నివారణ మందులు, 25 కోలకు పంపిణీ చేసినట్లు 32 పశుపోషకులు పాల్గొన్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది రమేష్, ఈశ్వర్ రావు, పశువైద్య సిబ్బంది సన్యాసిరావు, కరుణశ్రీ పాల్గొన్నారు.