
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం…
రుద్రూర్, జూలై 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారిచే ఉచిత వైద్య సేవలు అందించారు. రుద్రూర్ మండల తహసీల్దార్ సురేందర్ నాయక్ చేతులమీదుగా కాన్సర్ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది. ఎంపిడిఓ సురేష్ కుమార్ చే కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందుకు ప్యాప్స్మియర్ టెస్టులు, మమోగ్రామ్ టెస్టులు, ఎక్స్రేలు, బిపి టెస్టులు, షుగర్ టెస్టులు, ఈసిజి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న 168 మందిలో అవసరం అయిన రోగులకు ఉచితంగా చుక్కల మందులు ఇవ్వడం జరిగింది. ఇందులో 19 మంది రోగులకు కంటి ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ కు రెఫెర్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్, కార్యదర్శి లయన్ ప్రశాంత్ గౌడ్, కోశాధికారి లయన్ ఇమ్రాన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యామ్ సుందర్ పహడే, డైరెక్టర్స్ లయన్ పత్తి రాము, లయన్ కటికే రాంరాజ్, పుట్టి సాగర్, లయన్ గెంటీల గంగాధర్, లయన్ ఏం.రమేష్, లయన్ షేక్ తహెర్, లయన్ షామీర్, లయన్ లింగాల శంకర్, పుట్టి సందీప్, లయన్ హన్మంత్ రావు, బోజుగొండ అనిల్, శ్రీకాంత్ గౌడ్, డాక్టర్స్ ఏ. సూర్య, ఏం సాయి, అజయ్ గౌడ్, సిబ్బంది ఎస్.వెంకట సాయి, ఓరల్ ఆపరేషన్స్, మైకేల్ క్యాంప్ కో ఆర్డినేటర్, సూర్య,కల్యాణి మ్యామో గ్రాఫీ టెక్నిషన్ రవలి ప్యాప్స్మియర్ టెక్నీషియన్, పవన్ జనరల్ టెక్నిషన్, రాజు ఎక్స్రే టెక్నిషన్, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.