
వైద్యుడు భగవంతుడితో సమానం
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు
ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం చేసిన బక్కని
( పయనించే సూర్యుడు జూన్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
సమాజంలో వైద్యులు భగవంతుడితో సమానమని ప్రాణం పోసేది దేవుడైతే దానిని ఆపత్కాలంలో రక్షించేవాడు కూడా దేవుడితో సమానమేనని
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. ఉత్తమ డాక్టర్ గా ఇటీవల అవార్డు అందుకున్న డాక్టర్ మిర్యాల వెంకట రమణను మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సిములు, పరిగి నియోజక వర్గ టిడిపి అధ్యక్షులు చంద్రయ్య, వీరేందర్ రెడ్డి, ఒగ్గు కిషోర్, కృష్ణయ్య తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. చేసిన సేవలను గుర్తించి పురస్కారాలు అందజేయడం వల్ల మరింత ప్రోత్సాహంతో తమ రంగంలో తాము సేవలు అందించవచ్చని సూచించారు. అవార్డు గ్రహీతగా ఇలాంటివి మరెన్నో విజయాలు వరించాలని అభినందిస్తూ ఆశీర్వదించారు..
